రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు.
క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృత మైందన్నారు.
ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేష్ ను ప్రశంసించారు.
ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు.
యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా యువనేత లోకేష్ పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు

