గతంలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యానిమేషన్ మూవీ “ద లయన్ కింగ్”. డిస్ని సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అందుకే డిస్నీ సంస్థ “లయన్ కింగ్” సినిమా కోసం తెలుగులో ప్రముఖ నటీనటులతో జంతువులకు డబ్బింగ్ చెప్పించింది. ఈ చిత్రంలో అతి కీలకమైన ముఫాసా పాత్రకి తెలుగు, తమిళంలో పి.రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. అలాగే లయన్ కింగ్‌లో హీరో సింబా పాత్రకి తెలుగులో నేచురల్ స్టార్ నాని చెప్పారు. ఇక విలన్ పాత్రధారి స్కార్ పాత్రకి తెలుగులో వెర్సటైల్ ఆర్టిస్ట్ జగపతి బాబు డబ్బింగ్ చెప్పారు. టైమన్ పాత్రకి తెలుగులో కమెడియన్ ఆలీ చెప్పారు. అలాగే మరో కామెడీ పాత్ర అయిన పుంబ పాత్రకి తెలుగులో ప్రముఖ హస్యనటుడు బ్రహ్మాానందం డబ్బింగ్ చెప్పారు. అన్ని కార్యక్రమాలన్నీ పూర్తి చేసి జూలై 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
అలా తెలుగులో ‘సింబా’ పాత్రకి హీరో నానీ డబ్బింగ్ చెప్పిన వీడియో ఇటీవలే నాని విడుదల చేశారు. తాజాగా ఈ విషయంపై నాని స్పందిస్తూ “యానిమేషన్ కి సంబంధించిన పాత్రలకి డబ్బింగ్ చెప్పడమంటే నాకు చాలా ఇష్టం. ‘ఈగ’ సినిమాలో ఆ పాత్రకి రాజమౌళిగారు నాతో డబ్బింగ్ చెప్పిస్తారని అనుకున్నాను. కానీ ‘ఈగ’ పాత్రకి మాటలు ఉండవని ఆయన చెప్పడంతో చాలా నిరాశపడ్డాను. ఆ తరువాత ‘అ’ సినిమాలో చేపకి వాయిస్ ఇచ్చాను. ఇప్పుడు ‘ది లయన్ కింగ్’ సినిమాలో సింహం పాత్రకి డబ్బింగ్ చెప్పడంతో నా ముచ్చట తీరింది. ఈ సినిమాను చూస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయడం ఖాయం” అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఏ స్థాయిలో చిన్నారులను ఆకట్టుకుంటుందో చూడాలి.
సిగ్గు లేకుండా వైసీపీలో జాయిన్ అయ్యారు ఛీఛీ… : శ్రీరెడ్డి