telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

హైకోర్టులో డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్

ap high court

చిన్న పిల్లల అక్రమ రవాణా కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రత ఏపీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖలో పిల్లలను విక్రయించే ఒక ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని యూనివర్సల్ ఆసుపత్రి ముసుగులో పిల్లలను విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

పిల్లలను పోషించలేని తల్లిదండ్రులను గుర్తించి, వారికి డబ్బులు చెల్లించి చిన్నారులను కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. పిల్లలను ఇతరులకు విక్రయించారనే ఆరోపణలతో డాక్టర్ నమ్రతతో పాటు మరో ఆరుగురిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విశాఖ సెంట్రల్ జైల్ కు తరలించారు.

Related posts