టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కు గుడ్ బై చెబుతాడనే వార్తలు వెల్లువిరుస్తునాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ధోనీ మరింత కాలం కొనసాగాలని ఇప్పటికే ఎందరో మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు అభిప్రాయపడ్డారు. తాగాజా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కూడా ఇదే అంశంపై స్పందించారు.
హలో ధోనీ, నీవు రిటైర్ కావాలనుకుంటున్నావనే విషయాన్ని వింటున్నా.. దయచేసి ఆ దిశగా ఆలోచించకు. నీ ఆట మన దేశానికి ఎంతో అవసరం. రిటైర్మెంట్ గురించి ఆలోచించవద్దని నేను వ్యక్తిగతంగా కోరుతున్నా అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు.మరోవైపు, ధోనీ రిటైర్మెంట్ గురించి జోరుగా చర్చ జరుగుతున్నప్పటికీ, ఆయన నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.