హైదరాబాద్ నగరంలోని ఎంజే మార్కెట్ చౌరస్తాలోని కరాచీ బేకరీలో భారీ చోరి జరిగింది. బేకరీ షాప్ వెనుక ఉన్న షెటర్ తొలగించి దొంగలు చోరీకి పాల్పడ్డారు. బేకరీలో ఉన్న లాకర్ పగలగొట్టి రూ.10లక్షల నగదును ఎత్తుకెళ్లారు. లాక్‌డౌన్ నేపథ్యంలో బేకరీ ముందే పోలీస్ చెక్‌పోస్ట్ కూడా ఉంది.
నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి. ఇంతలా తనిఖీలు జరుగుతున్న చోట.. చోరీ జరగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బేకరీలో దోపిడీ జరిగిందని తెలుసుకున్న నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

