telugu navyamedia
pm modi ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు

విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అంజలి ఘటించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఎన్టీఆర్కు నివాళులర్పించారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. సమాజానికి సేవ చేయడం, నిరుపేదలు, అణగారిన వర్గాల ప్రజలకు సాధికారిత కల్పించడం కోసం ఆయన చేసిన కృషిని అభినందించారు.

ఎన్టీఆర్ నటించిన చిత్రాలు, రచనలు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఎన్టీఆర్ నుంచి మనం ఎంతో ప్రేరణ పొందామన్నారు.

మిత్రులు చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే ప్రభుత్వం ఎన్టీఆర్ దార్శనికతను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని ప్రధాని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు.

Related posts