బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని చెప్పారు.
ఇందుకోసం వారు నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్ కు బహిరంగ మద్దతును ప్రకటించారు.
న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు తాను సపోర్ట్ చేసినట్లు చెప్పారు.
తనపై మల్లన్న చేసిన కామెంట్స్ కు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియా లో ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.

