telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి లోకేష్ ను కలిసి అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం అందజేసిన మాదాల శ్రీరామ్ భాస్కర్

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల కోసం విరాళాలు అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు.

గుంటూరుకు చెందిన మాదాల శ్రీరామ్ భాస్కర్ ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి అన్న క్యాంటీన్లకు రూ.10లక్షల విరాళం అందజేశారు.

ఈ మేరకు చెక్ ను మంత్రి నారా లోకేష్ కు అందించారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చిన శ్రీరామ్ భాస్కర్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

Related posts