ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలలో ఎన్‌వి నిర్మల్ కుమార్ తెరకెక్కించిన చిత్రం “మిస్ మ్యాచ్”. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ చిత్రంలోని నీ మనసే.. సేసే అనే పాటని రీమేక్ చేశారు. నాలుగున్నర నిమిషాల సాంగ్ కోసం హీరో ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్‌తో పాటు టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు. 60 మంది డ్యాన్సర్స్, 200 మంది టెక్నీషియన్స్ నీ మనసే .. సేసే సాంగ్ కోసం 120 గంటల పాటు రిహార్సల్స్ చేశారు. తాజాగా చిత్ర మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలని చూస్తుంటే మూవీ షూటింగ్ చాలా సరదాగా జరిగినట్టు తెలుస్తుంది. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.