వరంగల్ జిల్లా హన్మకొండ ఘటన మరువకముందే హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో దారుణం జరిగింది. ఓ చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. రామాంతపూర్‌కి చెందిన 9 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం జరపడంతో ఆ చిన్నారికి తీవ్ర రక్త స్రావమైంది. దీనిని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కుటుంబ సభ్యుల సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
previous post


ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ