telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

నేడు బంగారం ధరలు ఇలా…?

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గడంతో రూ. 51,150 కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 46,890 కు చేరుకుంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 తగ్గడంతో రూ. 48,820 కు చేరుకుంది… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గడంతో రూ. 44,750 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం ఎగిసిపడుతున్నాయి. బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. కిలో వెండి ధర రూ. 2,200 పెరిగి రూ. 73,200 గా నమోదైంది.

Related posts