*క్యాసినో మాధవ రెడ్డి కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ నాదే- మంత్రి మల్లారెడ్డి
*ఎమ్యెల్యే స్టిక్కర్‌పై స్పందించిన మల్లారెడ్డి..
*ఆ స్టిక్కర్ నాదే..2020 మార్చి నాటి స్టిక్కర్
*అది నకిలీ స్టిక్కర్..ఆ స్టిక్కర్‌తో నాకు సంబంధం లేదు
క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ కుమార్‌పై ఈడీ దాడులు జరపడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
ఈ క్రమంలో మాధవరెడ్డి ఇంట్లో ఉన్న ఓ కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ కనిపించడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు..ఆ స్టిక్కర్ తనదేనని మంత్రి ఒప్పుకున్నారు. అయితే, 2022 మార్చి నాటి స్టిక్కర్ అని, మూడు నెలల క్రితం తీసి బయట పడేశానని చెప్పారు. అది తీసుకొని ఎవరో పెట్టుకుంటే తనకేంటి సంబంధం అని మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.
ఇక, క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇందుకు సంబందించిన ఫెమాను ఉల్లంఘించి సాగించిన హవాలా లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. అదే సమయంలో ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వారితో ప్రవీణ్ ప్రమోషన్ వీడియోలు చేయించారని.. ఇందుకు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.
వావిలాల గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఈటల…