telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రారంభమైన ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర

ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర ప్రారంభమయింది. 9 రోజుల పాటు మంటపాల్లో విశేష పూజలందుకున్న పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి ఎక్కించారు. ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్‌ పనులు చేశారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.

టెలిఫోన్‌ భవన్‌ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి శోభాయాత్ర సాగనుంది. మొత్తం 2.5 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది. ట్యాంక్‌ బండ్‌పై 4వ నంబర్‌ క్రేన్‌ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. మహా గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది భక్తులకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య గణనాథుని నిమజ్జనం ముగినుంది.

Related posts