బీజేపీ వల్లే ఆర్థిక మాంద్యం అని అర్థం వచ్చేలా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇది ఆర్థిక మాంద్యం కాదు… ఆర్థిక మందగమనమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌కు ఆర్థిక క్రమశిక్షణ ఉందని, రాష్ట్ర బడ్జెట్‌కు లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
కాళేశ్వరం ప్రారంభోత్సవానికి గిఫ్ట్‌ల కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. అసదుద్దీన్ సాధారణ ఎంపీ అని ట్రంప్‌ను ప్రశ్నించే స్థాయి ఆయనకు లేదన్నారు. అసద్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు. ఏపీలో ఇల్లీగల్ చర్చిల తొలగింపు రాష్ట్ర పరిధిలోని అంశమన్నారు. దేశంలో రోహింగ్యాల వివరాలు సేకరిస్తున్నామని, తెలంగాణలో 6 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.


