telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సీఎండీతో మంత్రి గొట్టిపాటి రవి టెలీకాన్ఫరెన్స్

విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సీఎండీతో మంత్రి గొట్టిపాటి రవి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

తుపాను వల్ల విద్యుత్ సమస్య తలెత్తిన ప్రాంతాలపై మంత్రి గొట్టిపాటి ఆరాతీశారు. కొన్నిచోట్ల ముందుజాగ్రత్త కోసం విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారుల వెల్లడి.

పెట్రోలింగ్ చేస్తూ సమస్య లేనిచోట విద్యుత్ పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడా వర్షం కురుస్తున్నందున పునరుద్ధరణకు సమయం పడుతుందన్న అధికారులు తెలిపారు.

అదనపు సిబ్బంది, అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలన్న మంత్రి గొట్టిపాటి. తుపాను తీవ్రత దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి, విద్యుత్ తీగలు తెగినా, స్తంభాలు కూలినా వెంటనే ప్రజలను అప్రమత్తం చేయండి అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.

Related posts