వైఎస్సార్సీపీది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం కడప జడ్పీ హాలులో విద్యాశాఖ ఇంజనీర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యా శాఖకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అమ్మఒడి, మనబడి లాంటి వినూత్నమైన పథకాలను వైఎస్ జగన్ ప్రవేశ పెట్టారని వెల్లడించారు.
అమ్మ ఒడి ద్వారా లక్షల మంది తల్లులకు లబ్ధి చేరుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే విద్యాశాఖకు రూ.33వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్ కె దక్కుతుందని అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను సమూలంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. విద్యాలయాలను ఆలయాలుగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, కళాశాలలను త్వరితగతిన పునర్నిర్మాణం చేస్తామని వెల్లడించారు.
ఆయన గంట కళ్లు మూసుకుంటే కథ వేరేలా ఉంటుంది..