telugu navyamedia
క్రైమ్ వార్తలు

కారం చ‌ల్లి కారులో హ‌త్య చేసిన దుండ‌గులు..

హైద‌రాబాద్ న‌గ‌రంలో హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని దారుణం జ‌రిగింది. గుర్తు తెలియ‌ని దుండ‌గులు.. కారులోని ఓ వ్య‌క్తిపై కారం చ‌ల్లి హ‌త్య చేశారు. హయత్​నగర్​లోని హైవే బావర్చీ దగ్గర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివార్లాలోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బావర్చి హోట‌ల్ వద్ద హత్య జరిగింది. విజయవాడ హైవేపై గల బావర్చి పక్కనే నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిని హత్య చేసి పడేసి వెళ్లిపోయారు. ఇవాళ ఉద‌యం కారులో మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పార్కింగ్ చేసి ఉందని భావించారు.

కానీ.. ఆ కారు దగ్గరి నుంచి వెళ్లిన వాళ్లు.. వెనుక సీట్లో ఏదో ఉండటాన్ని గమనించగా..వ్యక్తి ఒంటిపై గాయాలు, కారంపొడి చల్లి ఉండటం గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంట‌నే హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం అందించారు..

ఘటనా స్థలానికి చేరుకున్నపోలీస్ డాగ్ స్క్వాడ్ బావర్చి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బావ‌ర్చీతో పాటు ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

Related posts