telugu navyamedia
విద్యా వార్తలు

సాయంత్రం ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ ఫలితాలు..

ఆంధ్ర‌ప‌దేశ్ ఇంట‌ర్‌ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి, రెండు సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు వెల్లడించారు.

ఫలితాల విడుదల అనంతరం ఈ నెల 26 నుంచి నవంబర్ 2వరకు రీ వాల్యూవేషన్‌, రీ వెరిఫికేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని బోర్టు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రీ వాల్యువేషన్ పేప‌ర్‌కు రూ.260, రీ వెరిఫికేషన్‌ కొరకు రూ.1300 చెల్లించాల్సి ఉంటుందని, రీ వాల్యువేషన్‌, రీ వెరిఫికేషన్‌ సమయంలో స్కాన్‌ కాపీని ఉంచుకోవాలని సూచించారు.

ఇందుకోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. స్కానింగ్‌ ఆన్సర్ షీట్స్ కూడా ఆన్‌లైన్‌లోనే అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఏడాది ఎగ్జామ్స్‌కు జనరల్‌, వృత్తి విద్య విద్యార్థులు 3,24,800 మంది, రెండో ఏడాది పరీక్షలకు సాధారణ, వృత్తి విద్య కలిపి 14,950 మంది అటెండ్ అయిన‌ట్లు తెలిపారు.

ఫలితాలను http://bie.ap.gov.in, http://examresults.ap.nic.in, http://results.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. షార్ట్‌ మెమోలను ఈ నెల 25న సాయంత్రం 5 గంటల నుంచి bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Related posts