ప్రముఖ మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రబీష్ చక్కలకల్ కన్నుమూశాడు. 44 ఏళ్ల ప్రబీష్ ఎన్నో సక్సెస్ చిత్రాలకు పనిచేశారు. ఆయన భార్య, కూతురు ఉన్నారు. ప్రబీష్ మరణంపై మాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. కేరళలో వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రచారంలో భాగంగా యూట్యూబ్ కోసం తీస్తున్న లఘచిత్రం షూటింగ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. కొచ్చిలో రోడ్డుపై వ్యర్థాలు పారేయడాన్ని విమర్శించే విదేశీయుడి పాత్రను పోషించిన ప్రబీష్ తర్వాత అక్కడే ఫొటో షూట్ లో పాల్గొన్నాడు. అభిమానులతో, స్నేహితులతో ఫోటోలు, వీడియోలు తీయించుకుంటూ ఉండగా నీరసంతో కిందపడిపోయాడు. దప్పికవుతోందని చెప్పడంతో ఆయనకు నీళ్లు తాగించారు. తర్వాత అక్కడికక్కడే ఆయన చనిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించామని, అయితే కార్లు ఆగకలేదని అతని సహచరులు తెలిపారు. కొద్ది సేపటికి ప్రబీష్ కార్లోనే ఆస్పత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు. ఆస్పత్రికి తరలించే మార్గం మధ్యలోనే అతను మరణించినట్లు తెలుస్తుంది.


రామ్ గోపాల్ వర్మనే పెళ్లిచేసుకునేదాన్ని కానీ : గాయత్రీ గుప్త