ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న “మాస్టర్” సినిమా విడుదల కరోనా లాక్‌డౌన్ వల్ల ఆగిపోయింది. నిజానికి “మాస్టర్” చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూతపడటంతో రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ మురగ దాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సమయంలోనే తమిళ మీడియాలో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తో మురుగదాస్ విభేదించాడని స్క్రిప్ట్ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా సినిమా క్యాన్సిల్ అయ్యిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్ల పై సన్ పిక్చర్స్ సంస్థ స్పందించింది. ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, దర్శకుడు మురుగదాస్ తో ఎలాంటి విభేధాలు లేవని, మా మద్య మంచి వాతావరణం ఉందని సన్ పిక్చర్స్ అధికారిక ప్రతినిధులు పేర్కొన్నారు. స్క్రిప్ట్ విషయంలో మురుగదాస్ పర్ ఫెక్ట్ గా ఉంటాడని అందులో ఎలాంటి డౌట్ లేదని వారు అన్నారు. ఇలాంటి పుకార్లను విజయ్ అభిమానులు నమ్మి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
next post

