telugu navyamedia
National వార్తలు

పార్లమెంటు వ్యవహారాల్లో అంతరాయాలపై స్పీకర్ ఆందోళన – సోమవారం నుంచి కీలక అంశాలపై చర్చ

పార్లమెంటు సభా కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగని క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ పార్టీల నేతలతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా శుక్రవారనాడు తన ఛాంబర్‌లో సమావేశం జరిపారు.

సోమవరం నుంచి సభా కార్యక్రమాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని స్పీకర్ కోరారు.

గత ఐదు రోజులుగా సభ పదపదే వాయిదా పడుతుండటంతో స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంలో డీకోరం ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, సోమవారం నుంచి ఆపరేషన్ సిందూర్‌ పై చర్చ జరిపేందుకు కేంద్ర అంగీకరించింది. జూలై 21న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాలు పలు అశాంలపై చర్చించాలని పట్టుబడుతున్నాయి.

బీహార్‌లో ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఇండియా-పాకిస్థాన్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు, పహల్గాం ఉగ్రదాడి సహా పలు అంశాలు అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీయడంతో చర్చా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతూ వచ్చింది.

వరుసగా నాలుగో రోజు కూడా లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగింది. సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు బీహార్‌లో ఎన్నికల జాబితా రివిజన్‌పై చర్చించాలంటూ పట్టుబట్టారు.

ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై మోదీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగా జరుపుతున్న దాడి అని విమర్శలు గుప్పించారు.

Related posts