దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోన్న నేపథ్యంలో కొంతమంది స్వీయ నియంత్రణ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వెళ్లి బైక్‌పై షికారు చేస్తున్న తన భర్తపై ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన కేరళ ఎర్నాకులం జిల్లాలోని మువత్తుప్పుజాలో చోటు చేసుకుంది.
బయటకు వెళ్లొద్దని భార్య ఎంత వారించినా భర్త వినడం లేదు. దీంతో భర్త చేస్తున్న చేష్టలకు విసిగిపోయిన భార్య చేసేదిమీ లేక అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిద్దామని పోలీసులు అనుకున్నారు. ఫిర్యాదును విత్‌డ్రా చేసుకోవాలని ఆమెను పోలీసులు కోరారు. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భార్య పోలీసులను కోరింది. అతను బయటకు వెళ్లడం వల్ల కరోనా సోకే అవకాశం ఉందని, అది తనకు కూడా ప్రమాదమేనని భార్య వాపోయింది.

