telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాల సీజ్‌!

half day schools in AP since high temp

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు ప్రారంభించిన శ్రీచైతన్య పాఠశాలను బుధవారం విద్యాధికారి సీజ్‌ చేశారు.  అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తుండడంతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని మండల విద్యాధికారి బాబూ సింగ్‌కు తెలియజేశారు.

వికారాబాద్ పట్టణంలోని పాఠశాలను ఎంఈవో తనిఖీ చేసి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి సతీష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాతనే పాఠశాలలు తెరవాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ డివిజన్‌ కార్యదర్శి అక్బర్‌, నాయకులు సుభాష్‌ పాల్గొన్నారు.

Related posts