ఎల్‌బీనగర్ ప్రజలకు ఫిబ్రవరి మొదటి వారంలో తీపికబురు చెబుతామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలైన ఆస్తిపన్ను, భూముల రిజిస్ట్రేషన్ సమస్యలతో పాటు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం విషయం శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గురువారం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి గురువారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకే్‌షకుమార్, ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ సిక్తాపట్నాయక్, సీఈ సురే్‌షకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్తిపన్ను, భూముల రిజిస్ట్రేషన్ సమస్యలతో పాటు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం, ఇతర అంశాలను చర్చించారు. రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరించడంలో కొన్ని న్యాయపరమైన చిక్కులున్నాయని, వచ్చే అసెంబ్లీ సమావేశాల అనంతరం సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆటోనగర్ హరిణవనస్థలి వద్ద నిర్మించనున్న బస్‌టెర్మినల్, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న హిందూ, ముస్లిం, క్రీస్టియన్ శ్మశానవాటికల చిత్రాలను మంత్రికి చూపించి వివరించారు. నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఫిబ్రవరిలో ప్రారంభించి అర్హులకు అందజేస్తామని ఓ నేత తెలిపారు.


కుట్ర రాజకీయాలకు భయపడను: పవన్ కల్యాణ్