తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ పనిలేకే తమపై బురదజల్లుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కదని అన్నారు.
రూ.50 కోట్లతో పీసీసీ పదవి కొనుక్కున్నారని ఆ పార్టీలోని నేతలే అన్నారని గుర్తుచేశారు. పీసీసీ పదవి కొనుక్కున్న నేత రేపు ఎమ్మెల్యే టిక్కెట్టు అమ్ముకోరా? పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇళ్లు ఎలా వచ్చాయి? ఒకప్పుడు సున్నమేసిన వ్యక్తి.. ఇవాళ కన్నమేస్తున్నారు. నాకూ డ్రగ్స్‌కీ ఏం సంబంధం? ఏ పరీక్షకైనా నేను సిద్ధం. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం? ఇక నుంచి ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతాం అంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ మతం రంగు పులుముతోందని అన్నారు. ఏడేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. ఎంఐఎంకు ఎవరూ భయపడడం లేదని, బీజేపీనే భయపడుతోందని అన్నారు. ఆదిలాబాద్‌కు గిరిజన వర్సిటీ ఇస్తామన్న బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టులపై అమిత్ షా మాట్లాడాలని అన్నారు. ఢిల్లీ పార్టీలు సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కొత్త పార్టీలు ఎందుకు పుట్టాయో ప్రజలకు తెలుసని అన్నారు. అడ్రస్ లేని వ్యక్తులు కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని పట్టుకొని తాగుబోతు అనడం సరికాదన్నారు. ఎవర్నీ వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతాం.. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడుతామని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్‌ను ఓడించే సత్తా బీజేపీ మాత్రమే ఉంది..ఈ నెల 27 తర్వాత బీజేపీలో చేరికలు ..