telugu navyamedia
క్రీడలు వార్తలు

అందుకే పొట్టి సిరీస్ లో రాణించలేదు : రాహుల్

మూడు నెలలు క్రికెటేమీ ఆడకపోవడం వల్లే ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో విఫలమయ్యానని స్పష్టం చేశాడు భారత ఓపెనర్ కేఎల్ రాహుల్. భారత జట్టులో పోటీ ఎక్కువగా ఉంటుందని, ఏదో ఒక స్థానం మనకుంటుందని హాయిగా కూర్చోలేమన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్‌ కోల్పోయి సతమతం అవ్వడం సాధారణమేనని కేఎల్‌ తెలిపాడు. రాహుల్ వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో 1,0, 0, 14 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో మాత్రం అర్ధ శతకంతో రాణించాడు. నిరంతరం మ్యాచులు ఆడుతుంటే నా ఫామ్ బాగుంటుంది. నాకు ఇష్టమైనంత గేమ్‌ టైమ్‌ దొరక్కపోతే ఇబ్బంది పడతాను. నా మదిలో అదే మెదులుతూ ఉంటుంది. అందుకే సన్నద్ధమయ్యేందుకు ఏదో ఒక దారి వెతకాలి. అది శిక్షణైనా కావొచ్చు లేదా ఓపెన్‌ నెట్‌ సెషన్‌ అయినా కావొచ్చు. నేను సన్నద్ధమయ్యేందుకు సాధ్యమైనంత ప్రయత్నిస్తాను. కానీ మ్యాచ్‌లు ఆడటానికి ఏదీ సాటిరాదు. మ్యాచ్ ఆడితే అదో కిక్కు. నా సన్నద్ధతపై విశ్వాసం వల్లే వన్డేలో పుంజుకోగలిగా’ అని అన్నాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బాగా ఆడకపోతే నిరాశపడతాం. బాగా ఆడి దేశానికి విజయాలు అందిస్తూనే ఉండాలి అని రాహుల్‌ అన్నాడు.

Related posts