ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కోల్కత ముంబైని ఆల్ ఔట్ చేసింది. కేవలం రెండే ఓవర్లు వేసిన ఆండ్రీ రస్సెల్ 15 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ తో జట్టులో వచ్చిన ముంబై ఓపెనర్ డికాక్ నిరాశపరిచిన వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్(56) అర్ధశతకంతో రెచ్చిపోయాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ(43) పరుగులతో రాణించిన మిగిత ఆటగాళ్లు అందరూ వరుసగా పెవిలియన్ ధరి పట్టడంతో ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది ముంబై. అయితే కేకేఆర్ జట్టులో రస్సెల్ 5 వికెట్లు, పాట్ కమ్మిన్స్ రెండు వికెట్లు, షకీబ్ అల్ హసన్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే కేకేఆర్ 153 పరుగులు చేయాలి. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					


ఎఐసీసీ పెద్దల దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదు: డీకే అరుణ