ఇకపై ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేయాలని కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. హుస్సేన్‌సాగర్ కాలుష్యకాసారంగా మారిందని, అందులో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఖైరతాబాద్‌లో వచ్చే ఏడాది నుంచి 70 అడుగుల మట్టి విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు కమిటీ ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ప్రతిష్టించిన చోటే వినాయక నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్ణయించినట్లు కమిటీ ప్రకటించింది.

అయితే ..ఈసారి ట్యాంక్ బండ్ లోనే ఖైరతాబాద్ గణేశ్ ను నిమజ్జనం చేస్తామని.. అలా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని, కోర్టును ప్రత్యేకంగా కోరుతున్నామని ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ తెలిపారు. పర్మిషన్ లేదంటే విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతామని చెప్పారు.


సచివాలయాన్ని కూలగొట్టించడానికి కేసీఆర్ సిద్దమయ్యారు: రేవంత్ రెడ్డి