మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 21 కేంద్రీయ విద్యాలయ భవనాలు-కొన్ని పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా దెబ్బతిన్నాయని తనిఖీల్లో గుర్తించారని, దీంతో సురక్షితంగా లేని ఆ భవనాల్లో పాఠశాలలు నడపకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర లో ఎనిమిది, అస్సాంలో మూడు భవనాలను 1960లో నిర్మించారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో రెండేసి చొప్పున, త్రిపుర, మేఘాలయ, కేరళ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, సిక్కింలలో ఒక్కో భవనం చొప్పున మొత్తం 21 భవనాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. గుజరాత్, మహారాష్ట్రలో మూడు భవనాలు ఏమాత్రం సురక్షితం కావని పేర్కొంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల ద్వారా పదేళ్లకు పైగా ఉన్న పాఠశాల భవనాలకు సంబంధించిన నివేదికను రూపొందించాల్సిందిగా కేంద్రీయ విద్యా సంగతన్ ఆదేశించింది.
మొత్తంగా నాలుగు భవనాలు, గుజరాత్‌లో ఒకటి, మహారాష్ట్రలో మూడు భవనాలు పునర్ నిర్మించేందుకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 17 భవనాలకు సంబంధించి, నిర్మాణ సంస్థల నుండి అంచనాలను స్వీకరించి, నిధుల లభ్యత ఆధారంగా మరమ్మతు లేదా పునర్‌నిర్మించడం చేపడతామని అన్నారు. కాగా, విద్యాలరు సంగతన్ దేశవ్యాప్తంగా 260 కేంద్రీయ విద్యాలయాలను నడుపుతుండగా, వాటిలో కొన్నింటిని వివిధ సంస్థలు అందించే విరాళాల ద్వారా తాత్కాలిక భవనాల్లో నడుపుతున్నామని, అలాంటివి మధ్యప్రదేశ్, జమ్ముకాశ్మీర్, బీహార్‌లో ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.


రాజకీయాలు కావాలంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి: జవహర్