ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో మిత్రుత్వం కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఏఏను అడ్డుకోవడమంటే పాకిస్థానీ ముస్లింలకు మనదేశ పౌరసత్వం కోరడమేనని అన్నారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పారని లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భైంసాలో టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలే బీజేపీకి పెద్ద బలమని ఆయన అన్నారు.


కమిటీ నిర్ణయం ప్రకారం రాజధానిపై నిర్ణయం: మంత్రి కొడాలి