సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నెపోటిజం పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా కరణ్ ను టార్గెట్ చేయడం వివాదంగా మారింది. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో ఒక్కసారిగా నెపోటిజంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు నెటిజన్లు. అందులో భాగంగా కరణ్ జోహార్, అలియా భట్, ఏక్తా కపూర్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, సోనమ్ కపూర్ లాంటి ప్రముఖులను టార్గెట్ చేశారు. అయితే కరణ్ జోహార్ పై కూడా విపరీతంగా ట్రోల్ జరుగుతుండడంతో సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసాడు కరణ్. ట్రోల్స్ తో కరణ్ ఏకంగా తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ ను డియాక్టివేట్ చేసి తాత్కాలికంగా కొత్త అకౌంట్ ను క్రియేట్ చేశాడు. ఆ రేంజ్ లో నెటిజన్లు కరణ్ పై ట్రోల్స్ చేశారు. ఇక గత నెల రోజులుగా తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న కంగనాపై కూడా చట్టపరమైన చర్యలకు కరణ్ సిద్దమయ్యాడట. ఇన్నాళ్లు ఓపిక పట్టిన తాను ఇకపై వాటిని ఉపేక్షించను అంటున్నాడు. ఒక్కరు తన గురించి చెడుగా ప్రచారం చేసినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. కంగనా, స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ల మద్య ఉన్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు సందర్బాల్లో కరణ్ జోహార్ పై బాహాటంగానే కంగనా వ్యాఖ్యలు చేశారు. ముందు నుంచే ఇద్దరి మద్య చాలా వివాదాలు ఉన్నాయంటూ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి.
next post

