మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌కు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. ఆయన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొందరు ఆయన్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్స్ చేశారు. దీనిపై ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే… ఐదు రోజుల క్రితం కళ్యాణ్ దేవ్ తనను కొందరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని పోలీసులకు పిర్యాదు చేశారు. కొందరు ఐదారు ఫేక్ అకౌంట్స్‌ను క్రియేట్ చేసి బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారని కల్యాణ్ దేవ్ తన పిర్యాదు అందుకున్న పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసులు లెటర్ రాశారు. వారి నుండి వివరాలు అందగానే తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
previous post
next post
విజయ్‌పై బిగ్‌బాస్ బ్యూటీ కాపీ ఆరోపణలు