అభ్యర్థుల గెలుపు కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన వంతు కృషి చేశారని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం తక్కువగా ఉండటం వల్ల కొంత ఇబ్బందిపడినా, ఆరోగ్య సమస్య తలెత్తినా పవన్ కల్యాణ్ పట్టించుకోలేదన్నారు.
తమ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డాడని కొనియాడారు. ఇది ఎన్నికల కోసం మొదలు పెట్టిన ప్రయాణం కాదని, నవతరానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో పవన్ ముందడుగు వేశారని ప్రస్తావించారు. తెలంగాణలో సైతం తమ కార్యకర్తలు జనసేన పార్టీకి ఎంతో అండగా నిలిచారని ప్రశంసించారు. ఈ సమావేశానికి ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన యువ అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎదురైన అనుభవాలను తెలుసుకున్నారు.
టీపీసీసీ పదవిపై నాకు ఆసక్తి లేదు: వెంకటరెడ్డి