జమ్ము కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇటీవలే నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోకి నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఈ నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో ప్రవేశించినట్లు తెలిపాయి. రద్దీ ఉండే ప్రాంతాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదుల చొరబాటు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్త్మయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.