విద్యార్థుల మాక్ అసెంబ్లీపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశంసలు కురిపించారు. చిన్న పిల్లలైనా చక్కగా అసెంబ్లీ నడిపారు అన్నారు.
వాళ్లను చూసైనా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ప్రజా సమస్యలపై ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలంటూ హితవు పలికారు.
ఇప్పటికైనా అసెంబ్లీకి హాజరై ప్రజాసమస్యలపై చర్చించాలని జగన్ కు సూచించారు.
ప్రజలకు ప్రతినిధిగా జనం సమస్యలపై బయటకన్నా సభలో మాట్లాడడం వల్ల ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు.
లేదంటే త్వరలోనే అర్హత కోల్పోయే పరిస్థితి వస్తుందని జగన్ ను ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాక్ అసెంబ్లీ నడిపిన తీరును యనమల కొనియాడారు.

