telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఏపీ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ మాజీ సీఎం సినిమా చూపిస్తానని అంటున్నారని జగన్ హర్రర్ మూవీ చూసి ఏపీ ప్రజలు దడుచుకున్నారని సిగ్గు లేకుండా మళ్లీ సినిమా చూపిస్తా అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

2019 నుంచి 2024 వరకు ఒక హారర్ మూవీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించిన ఘనత జగన్‌ ది అంటూ ఎద్దేవా చేశారు.

11 స్థానాలకు పరిమితం చేసినప్పటికీ జగన్ మోహన్ రెడ్డిలో అహంకారం తగ్గలేదన్నారు. ఐదు సంవత్సరాలు ఏపీలో రాక్షస రాజ్యం రాజ్యమేలిందన్నారు.

ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ నేతలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తాటాకు చప్పులకు భయపడేవారు ఏపీలో ఎవరూ లేరన్నారు.

జగన్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి పరిస్థితి లేదన్నారు. శేష జీవితం మొత్తం పబ్జీ గేమ్ ఆడుకుంటూ 70ఎంఎం థియేటర్లో సినిమాలు చూస్తూ బతకాల్సిందే అంటూ సెటైర్ విసిరారు.

జగన్ను నమ్మి ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.

తాను 16 నెలల పాటు జైల్లో ఉన్న దగ్గరికే ఐఏఎస్ అధికారులను తీసుకువెళ్లాలని కంకణం కట్టుకున్నట్లు ఉన్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులను రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు.

అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లలో లక్షల కోట్ల కుంభకోణాలు చేశారన్నారు. మట్టిలో మద్యంలో వేలకోట్ల రూపాయలు వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఏపీని వికసిత ఆంధ్రప్రదేశ్ చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల కష్టాలు, ఇష్టాలు తెలుసుకునేలా ఏ రోజు జగన్ వ్యవహరించలేదన్నారు.

జగన్ విధ్వంసం గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వానికి ఏడాది పట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత జగన్కు లేదన్నారు.

జగన్ అవినీతిపై నిష్పక్షపాతంగా చట్ట పరిధిలో విచారణ జరిపి శిక్షిస్తామన్నారు. జగన్ శేష జీవితం సినిమాలకే సరిపోతుందని తనకు సినిమా చూపించే పరిస్థితి ఉండదని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts