telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కొండచరియలు విరిగిపడిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న జగన్…

కొండ చరియలు విరిగిన పడిన అంశాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళాం అని పైలా సోమి నాయుడు తెలిపాడు. కలెక్టర్,ఎండోమెంట్ సెక్రటరీ, ఈఓ గారికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కేశఖండన శాల,ప్రసాదం పోటు తయారీ కేంద్రం,భోజన శాల ఏర్పాటు,సోలార్ ప్యానెల్ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులకు 70కోట్లను సీఎం విడుదల చేసారు అన్నారు. 70 కోట్లతో ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తాం అని తెలిపారు.

అయితే కొండచరియలు విరిగిపడిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నరు జగన్. దుర్గగుడి పై కొండ చరియలు విరిగి పడటం, సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ కారణంగా నాలుగు గంటల పాటు భక్తులకు దర్శనం వేశారు అధికారులు. నాలుగు గంటల నుంచి భక్తులను అనుమతించడంతో.. క్యూలైన్ లోనే భక్తులు వేచిఉన్నారు. నాలుగు గంటల అనంతరం తిరిగి ప్రారంభమైంది దుర్గమ్మ దర్శనం. కొండరాళ్ళు తొలగింపు చర్యలు అధికారులు ప్రారంభించారు. ముందుగా షెడ్ కు సంబంధించిన రేకులు తొలగింపు చేపట్టారు అధికారులు.

Related posts