జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్ లతో వినోదినిగా పాపులర్ అయ్యాడు వినోద్. ఇటీవల వినోద్‌పై హత్యాయత్నం జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఓ ఇంటి వివాదంలో వినోద్ పై తీవ్రంగా దాడి చేశారు. ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షలు ఇచ్చానని, అయితే ఎంతకీ రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో పాటు, తన డబ్బు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో నిలదీశానని వినోద్ వెల్లడించాడు. సెటిల్మెంటు చేసుకుందాం రమ్మని చెప్పి తనపై హత్యాయత్నం చేశారని తెలిపాడు. రూ.10 లక్షలు అడ్వాన్స్ రూపంలో ఇచ్చానని, అయితే ఇల్లు ఇవ్వం, డబ్బులు ఇవ్వం పొమ్మని అవతలి వ్యక్తులు దౌర్జన్యం చేశారని వినోద్ వాపోయాడు. ఇంటి పైకి పిలిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని వివరించాడు. తప్పించుకుని కిందికి రాగా, వెంటపడి మరీ కడుపులో తన్నారని, తల చిట్లిందని, ఎముకలు విరిగిపోయాయని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటనలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ ఆ రోజున ఇంటికి సంబంధించిన వ్యక్తులు నాపై దాడి చేసిన దగ్గర నుంచి ఓ కన్ను సరిగ్గా కనిపించడం లేదు. అంతే కాదు గాయమైన కన్ను చిన్నగా అయ్యిందని కొంత మంది అనడం ఎంతో బాధకలిగిస్తుందని అన్నారు. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన జబర్ధస్త్ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాడు వినోద్. ఇక దాడితో పాటు తన పెళ్లి విషయం కూడా చెప్పాడు వినోద్. తనకు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందని.. ఈ ఈ శ్రావణమాసంలో పెళ్లి జరగాల్సింది కానీ దాడి జరగడంతో ఆగిపోయిందని చెప్పాడు జబర్దస్త్ కమెడియన్. తాను మానసికంగా, శారీరకంగా ధృడంగా అయిన తర్వాత ఈ ఫెళ్లి గురించి ఆలోచిస్తానంటున్నాడు వినోద్. ఈ విషయం పూర్తిగా అయిపోయిన తర్వాతే పెళ్లి అంటున్నాడు ఈ కమెడియన్. అన్నీ కుదిరిన తర్వాత మరోసారి మంచి ముహూర్తం పెట్టుకుంటామని చెప్పాడు వినోద్. ఇదిలా ఉంటే తనను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తమ బంధువే అని ఓపెన్ అయ్యాడు ఈయన. చిన్నప్పటి నుంచి చూస్తోంది కాబట్టి భవిష్యత్తులో కూడా తన నుంచి ఎలాంటి సమస్యా రాదని తెలిసిన తర్వాతే పెళ్లికి ఒప్పుకుందని చెప్పాడు వినోద్.
previous post

