టాలీవుడ్ కి ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఛలో సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు శౌర్య. ఈ సినిమా తర్వాత సౌజన్య దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూట్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది.ఏ ఈసినిమాలో శౌర్య సరసన పెళ్లిచూపులు ఫెమ్ రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసారని తెలుస్తుంది. ఈ సినిమాకు వరుడు కావలెను అనే టైటిల్ ను పెట్టారని ఫిలిం నగర్ టాక్. త్వరలోనే టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి మూవీ విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
రాశిఖన్నా వేధించేది… వర్మ “నగ్నం” హీరోయిన్ వ్యాఖ్యలు