తెలంగాణలో వరంగల్ జిల్లా లోని విషాదం చోటు చేసుకుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం ఓ విద్యార్థి నిండు ప్రాణం బలైంది. సీనియర్ల బలవంతం వలన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని కరుణాపురంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రభుత్వ హాస్టల్ లో పరకాల శాయంపేటకి చెందిన భరత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఇదే హాస్టల్ లో రెండవ సంవత్సరం చదువుతున్న సీనియర్స్ గుట్కా పాకెట్స్ తీస్కొని రమ్మని సోమవారం భరత్ పై ఒత్తిడి చేశారు. గుట్కా ప్యాకెట్స్ తీసుకువచ్చిన సమయంలో వాచ్ మెన్ కంట పడడంతో భారత్ ని ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళ్లారు.ఈ విషయాన్ని భరత్ తల్లి తల్లిదండ్రులు దృష్టి తీసుకువెళ్ళారు. దీంతో ఏంచేయాలో తెలీక భరత్ కాలేజి నుండి చెప్పకుండా వెళ్ళిపోయి ఇంటికి చేరుకున్నాడు.
మనస్తాపంతో పరకాల శాయంపేటలోని తమ పొలం దగ్గర గడ్డి మందు తాగి ఇంటికి రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక హాస్పిటల్ లో చేర్చగా అప్పటికే సీరియస్ అయింది. దీంతో అతడిని వరంగల్ ఎంజీఎంకి తీసుకురాగా చికిత్స పొందుతూ మరణించాడు. తమ కుమారుడి చావుకు కారణం కాలేజీ యాజమాన్యమే అని కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

