telugu navyamedia
రాజకీయ

భారత జర్నలిస్టు శ్రీలంకలో అరెస్ట్

young man arrested for selfie in polls
భారత్ కు చెందిన ఫొటో జర్నలిస్టు సిద్దిఖీని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్టర్ సండే  పేలుళ్ల  అనంతరం తాజా సమాచారం   కవర్ చేసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఓ స్కూల్‌లోకి వెళ్లాడంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. సిద్దిఖి అహమద్ డానిష్ ఢిల్లీలో రాయటర్స్‌ న్యూస్ ఏజెన్సీలో ఫొటో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు.  ఉగ్రదాడుల అనంతరం ఇటీవల ఆయన శ్రీలంక వెళ్లారు. నెగొంబోలోని ఓ స్కూలు అధికారులతో మాట్లాడేందుకు ఆయన బలవంతంగా లోపలికి వెళ్లాడని ఆరోపిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన ఉగ్రదాడిలో ఓ స్కూలు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు సిద్దిఖీ స్కూలులోకి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నెగొంబో మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. ఈ నెల 15 వరకు మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించినట్టు తెలిపారు.

Related posts