telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పాకిస్తాన్ రైలు ప్రమాదంలో 62కి చేరిన మృతుల సంఖ్య

train accident pakistan

పాకిస్థాన్ లోని లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న తేజ్‌గావ్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ రోజు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. రహీమ్ యార్‌ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ వద్ద రైలులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో 62 మంది సజీవ దహనమయ్యారని, మరో 13 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగడంతో రెండు బోగీలు దగ్ధమయ్యాయని వివరించారు.

ప్రయాణికుల్లో కొందరు కోడి గుడ్లు ఉడకపెట్టడానికి గ్యాస్‌ వెలిగించారని, ఈ కారణంగానే మంటలు చెలరేగాయని సమాచారం. అగ్నిమాపక దళాలు, ఆర్మీ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ విచారం వ్యక్తం చేశారు.

Related posts