మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై ఇవాళ(బుధవారం) హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ. కేసీఆర్, హరీష్ రావులు రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
కాళేశ్వరం నివేదికలో ముఖ్య సూత్రధారులుగా ఇరువురి పేర్లను ఘోస్ కమిషన్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు హైకోర్టులో పిటిషన్లు ధాఖలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది.
దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటికి వచ్చాయి.
ఒక ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆద్యంతం తానే అయి పాత్ర పోషించడంతో ఈ అంశం చర్చనీయాంశం అయింది.
మేడిగడ్డ బ్యారేజీని ఎక్కడ కట్టాలో నిర్దేశించింది కేసీఆర్. ఎలా కట్టాలీ, ఎంత నీరు నిల్వ చేయాలీ, ఎలా నిర్వహించాలి అన్న విషయాలతో పాటు, ప్రాజెక్టు ఆర్థిక అంచనాలను మార్చేసింది కూడా ఆయనే.
సెంట్రల్ వాటర్ కమిషన్, హైపవర్ కమిటీ నిపుణుల సూచనల్ని నామమాత్రంగా కూడా పట్టించుకోలేదని నివేదికలో చెప్పుకొచ్చారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని హరీష్ రావు ఆరోపించారు.
మైనార్టీల హక్కులు పూర్తిగా అణచివేస్తున్నారు: రఘువీరా