టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ వారసుల్లో ఎక్కువ వరకు మగవారే ఉన్నారు. చాలా తక్కువ మంది హీరోలు తమ కూతుళ్లును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ కిడ్స్‌లో మంచులక్ష్మీ, నిహారిక, శివాత్మిక, శివాణి టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో శ్రీకాంత్ కూతురు మేధ కూడా చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
17 ఏళ్ల మేధ త్వరలోనే హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుందని టాక్. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె భరత నాట్యంలో శిక్షణ తీసుకుంటుందట. ఇక కూతురు ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా మంచి కథలను ఎంచుకునే పనిలో ఉన్నారట శ్రీకాంత్- ఊహ దంపతులు. ఇప్పటికే కొన్ని కథలను కూడావిన్నారట.
అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలో శ్రీకాంత్ వారసురాలిని మనం సిల్వర్ స్క్రీన్‌పై చూడొచ్చు అని అంటున్నారు. మరోవైపు శ్రీకాంత్ కొడుకు రోషన్ ‘నిర్మల కాన్వెంట్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ‘పెళ్లి సందD’అనే సినిమా చేస్తున్నాడు రోహిత్.
నేను కూడా దానికి బాధితురాలినే… : కస్తూరి