తమిళ హీరో శింబు తన మంచి మనసును చాటుకున్నాడు. ఎప్పుడూ వివాదాల్లో ఉండే శింబు ఈ సారి మాత్రం ఓ మంచి పని చేసి వార్తల్లోకి ఎక్కాడు. “ఈశ్వరన్” సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం బహుమతిగా ఇచ్చాడు. అలాగే 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు దుస్తులు అందజేశాడు. దీపావళి కానుకగా శింబు ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చింది. శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా పరిచయమైన హీరో. శింబు నటించిన మన్మథ, వల్లభ లాంటి సినిమాలు తెలుగువారిని బాగా అలరించాయి. దీంతో శింబు తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శింబు నటిస్తున్న ఈశ్వరన్ అనే తమిళ సినిమా తెలుగులో ఈశ్వరుడు పేరుతో విడుదల కానుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ నటించనుంది. ఈ సినిమా తమన్ సంగీతం అందించనున్నాడు.
previous post