telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎప్పటికైనా నేను రాసుకున్న కథలతో వారితో సినిమాలు తీస్తా : రాజ్ తరుణ్

Raj-Tarun

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యట్రిక్ విజయాలను అందుకున్నాడు. దీనితో రాజ్ తరుణ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు రాజ్ తరుణ్. సినిమాల్లోకి రాకుముందు 52 షార్ట్‌ ఫిలింస్‌ ని చేసినట్టుగా వెల్లడించాడు రాజ్ తరుణ్.. ఇక ‘ట్యాక్సీవాలా’, ‘గీత గోవిందం’, ‘శతమానం భవతి’, ‘నేను లోకల్‌’ సినిమాల ఎందుకు వదులుకున్నాడో రాజ్ తరుణ్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ట్యాక్సీవాలా కథ బాగా నచ్చినప్పటికీ హారర్‌ జోనర్‌ లో కథ ముందు ఎప్పుడు చేయకపోవడంతో ఆ సినిమాని వదులుకున్నట్టుగా రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఇక శతమానం భవతి సినిమాకి ముందు మూడు సినిమాలకి కమీట్ అయి ఉండడంతో డేట్స్‌ అడ్జెస్ట్ కాక సినిమాని వదులుకున్నట్టుగా రాజ్ తరుణ్ వెల్లడించాడు. అటు నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే చిత్రాల కథలను రైటర్ ప్రసన్న ముందుగా చర్చించాడు కానీ ఎప్పుడు ఆఫర్‌ చేయలేదని రాజ్ తరుణ్ వెల్లడించాడు. ఇక సునీల్, అల్లు అర్జున్ కోసం రెండు కథలు రాసుకున్నానని ఎప్పటికైనా ఆ కథలను వారితో తీస్తానని రాజ్ తరుణ్ వెల్లడించాడు. ఇక రాజమౌళితో సినిమా చేయాలనేది తన డ్రీం అంటూ చెప్పుకొచ్చాడు.

Related posts