గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో జరుగుతున్న సిని’మా’ రాజకీయాలకు రేపటితో ముగింపు రాబోతుంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి మా ఎలక్షన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. రేపు (ఆదివారం )జరిగే ఎన్నికలను సజావుగా జరగడానికి 100 మంది పోలీసులు 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ తో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీనియర్ నటుడు , “మా ” పూర్వ అధ్యక్షుడు మాగంటి మురళి మోహన్ తెలిపారు .

జూబిలీహిల్స్ స్కూల్ లో ఎన్నికల ఏర్పాటును మురళి మోహన్ పర్యవేక్షించిన మురళి మోహన్ మాట్లాడుతూ . “స్కూల్ లోకి “మా ” సభ్యులను మాత్రమే అనుమతిస్తాము . వచ్చిన వారు వి విగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేశాము. అలాగే ఓటు వెయ్యడానికి మూడు రూములు అందుబాటులో ఉంచాము ” అని చెప్పారు .
“ఇక “మా “ఎన్నికలను కవర్ చెయ్యడానికి స్కూల్ బయట మీడియా పెయింట్ ఏర్పాటు చేశాము . ప్రెస్ కూడా లోపలకు రావడానికి అనుమతి లేదు . ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారీ బందోబస్త్ ఏర్పాటు చేశామని మురళి మోహన్ చెప్పారు .

ఆదివారం ఉదయం 8. 00 గంటలకు పోలింగ్ మొదలై 2. 00 గంటలకు పూర్తి అవుతుంది , సాయంత్రం 4. 00 గంటలకు స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన వేదికపైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది .
కాగా..రేపు జరగబోయే ఎన్నికలలో ఎవరు గెలుస్తారు.. ప్రకాష్ రాజ్ గెలిస్తే.. పరిస్థితులు ఏంటీ.. మంచు విష్ణు గెలిస్తే పరిస్థితులు ఏంటీ..అన్న సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

