telugu navyamedia
ఆరోగ్యం

బ్రౌన్‌ రైస్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు

ముడి బియ్యం(బ్రౌన్‌ రైస్) ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని మనం నిత్యమూ తింటే ఎంతో మేలు చేస్తుంది. చాలామంది వైట్ రైస్ అంటేనే ఇష్టపడతారు. ఎందుకంటే అది చూసేందుకు బాగుంటుంది. అన్నం ముత్యాల్లా ఉంటుంది. కానీ అందులో పోషకాలు ఉండవని తెలుసుకోవాలి. ముడి బియ్యాన్ని బాగా పాలిష్ చేయడం వల్ల వాటిపైన ఉన్న పొర తొలగిపోయి బియ్యం తెల్లగా అవుతాయి. వీటితో పోషకాలు కూడా పోతాయి. పాలిష్ చేయని ముడిబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. బ్రౌన్ రైస్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. తక్కువ కేలరీలు ఎక్కువ ఫైబర్లు అందించే ఈ బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం, ఫాస్పరస్, థయామిన్, నియాసిన్, విటమిన్ B6 వంటి మూలాలు కూడా ఉన్నాయి.

* వైట్ రైస్(పాలిష్ చేసినవి) తినడంతో మన శరీరంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి. కానీ బ్రౌన్ రైస్ వల్ల చక్కెర స్థాయిలు అలా పెరగవు. డయాబెటీస్ ఉన్నవారికి బ్రౌన్‌రైస్ మరింత మేలు చేస్తుంది. బ్రౌన్ రైస్‌లో ఫైటిక్ యాసిడ్ మరియు ఫైబర్ అనే న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిని సమర్థవంతంగా తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే డయాబెటీస్ లేనివారు కూడా రోజూ బ్రౌన్ రైస్ తినడం వల్ల డయాబెటీస్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. రోజుకు 50 గ్రాముల బ్రౌన్‌రైస్ తీసుకుంటే డయాబెటిస్ ముప్పు 16 శాతం తగ్గుతుంది.

* బ్రౌన్ రైస్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

* బ్రౌన్ రైస్‌లో పీచు పదార్థం అధికంగా ఉండటంతో ఎక్కువగా ఆకలి వేయదు. దీంతో అధిక బరువు తగ్గే అవకాశం ఉంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

* బ్రౌన్‌ రైస్‌ను రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. బ్రౌన్‌ రైస్‌లో ఉండే విటమిన్ బి1, మెగ్నీషియం గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. బ్రౌన్ రైస్‌లో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్‌లకు ఆర్టరీస్‌లో పేరుకున్న ప్లేగ్‌ను తొలగించే సామర్థ్యం ఉంటుంది. దీనివల్ల గుండెకు రక్త సరఫరా బాగా జరుగుతుంది.

* బ్రౌన్‌ రైస్‌లో ఐపీ6 అనబడే సహజసిద్దమైన సమ్మేళనం ఉంటుంది. దీనిని క్యాన్సర్ చికిత్సలో వాడతారు. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. బ్రౌన్‌ రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో క్యాన్సర్ కారక కణాల వృద్ధిని అరికడుతుంది.

* బ్రౌన్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి సిస్టమ్ ని సహజంగా డిటాక్సిఫై చేస్తాయి. టాక్సిన్స్ ను తొలగిస్తాయి.

* వారానికి మూడు రోజులు బ్రౌన్‌రైస్ తినేవారిలో ఆస్తమా ముప్పు 50 శాతం తగ్గుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

* మతిమరుపు, అల్జీమర్స్, డిమోన్షియా లాంటి వ్యాధులను సైతం ఇది దూరం చేస్తుంది.

* ఒక కప్పు బ్రౌన్‌రైస్‌‌లో 21 శాతం మెగ్నీషియం ఉంటుంది. బ్రౌన్ రైస్‌లోని మెగ్నీషియం, కాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

* డిప్రెషన్ వంటి వివిధ మానసిక సమస్యలను తొలగించే సామర్థ్యం కలిగిన సహజసిద్ధమైన గ్లుటామైన్, గ్లిజరిన్ మరియు జీఏబీఏ వంటి కొన్ని నిత్యావసర ఎమినో యాసిడ్స్ బ్రౌన్ రైస్‌లో లభిస్తాయి. ఇవి మెదడులోని సిరోటినిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. మెదడులోని యాంగ్జైటీ, డిప్రెషన్ కు సంబంధించిన లక్షణాలను తగ్గిస్తాయి.

ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్, మెగ్నీషియం మరియు కేల్షియం వంటి మినరల్స్ బ్రౌన్ రైస్ లో సమృద్ధిగా లభిస్తాయి. దీంతో ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి.

Related posts