వస్తు సేవల పన్ను (జీఎస్ టీ) వసూళ్లు అక్టోబర్‌లో రూ.1,05,155 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది గత ఎనిమిది నెలల్లో జీఎస్‌టీ వసూళ్లు లక్ష కోట్లను దాటడం ఇదే మొదటిసారి. 2020 అక్టోబర్ 31 వరకూ దాఖలైన జీఎస్‌టీఆర్-3బీ రిటర్న్ లు 80లక్షలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. అక్టోబర్ నెలలో వసూలైన గ్రాస్ జీఎస్‌టీ రెవెన్యూ రూ.1,05,155 కోట్లు కాగా..ఇందులో సీజీఎస్‌టీ రూ.19,193 కోట్లు. ఎస్‌జీఎస్‌టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 52,540 కోట్లు (సరుకుల దిగుమతి ద్వారా వసూలైన రూ.23,375), సెస్ రూ. 8,011 కోట్లు (సరుకుల దిగుమతి ద్వారా వసూలైన రూ.932 కోట్లతో కలిపి) అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్ నెలలో వసూలైన రెవెన్యూ గతేడాది ఇదే నెలలో వసూలైన మొత్తం ( రూ.95, 379 కోట్లు) కంటే 10 శాతం ఎక్కువని వెల్లడించింది. కోవిడ్ -19 దేశంలో ఆర్థిక కార్య కలాపాలు కుంటుపడిన నేపథ్యంలో జీఎస్‌టీ తాజా వసూళ్లు ఊరట కలిగించే పరిణామం.
previous post
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై జేపీ ఆసక్తికర వ్యాఖ్యలు