telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టెక్నాలజీ వాడి పౌర సరఫరాల వ్యవస్థను పారదర్శకత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది: మంత్రి నాదెండ్ల మనోహర్

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు.

పౌర సరఫరాల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెక్నాలజీ వాడి పౌర సరఫరాల వ్యవస్థను పారదర్శకత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.

స్మార్ట్ రైస్ కార్డులను అందించడం సహా ఈపోస్ యంత్రాలను ఆధునీకరించి అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ వచ్చాక రూ.234 కోట్ల విలువైన పీడీఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నామని సభలో తెలిపారు.

రైస్ స్మగ్లింగ్ చేస్తే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించి అమలు చేస్తున్నామన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

కాకినాడ పోర్ట్‌లో 3 , విశాఖలో 3 , నెల్లూరు 1 చెక్ పోస్టు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. 5.65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏడాదిలోనే స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి 5.45 కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించారని రెండు రోజుల్లో ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Related posts